ఐఐటీ లో సీటు సాధించిన పేద విద్యార్థికి ఎంపీ కవిత చేయూత

IMG-20170702-WA0375

ఐఐటీ లో సీటు సాధించిన పేద విద్యార్థికి ఎంపీ కవిత చేయూత

ఐఐటీ లో సీటు సాధించిన పేద విద్యార్థికి ఎంపీ కవిత చేయూత

ట్విట్టర్ లో చేసిన అభ్యర్థనకు స్పందించి నాలుగు సంవత్సరాల కోర్సుకు మొత్తం సుమారు 5 లక్షలు జాగృతే భరిస్తుందని హామీ.

నేడు మొదటి విడత చెక్కు అందజేసిన జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి.

ఐఐటి మద్రాస్ లో సీటు సాధించిన ఒక పేద విద్యార్థి ఫీజు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణ అధ్యక్షులు, ఎంపీ కల్వకుంట్ల కవిత గారి సహాయం కోరగా ఎంపీ గారు ఇచ్చిన చేయూత అతని ఐఐటీ కలను నిజం చేయబోతుంది. సిద్దిపేట జిల్లా సైదాపూర్ మండలంలోని ఘనపూర్ తండా కు చెందిన గిరిజన విద్యార్థి మహేందర్ కు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లే కూలి చేసి కొడుకుని చదివిస్తూ వచ్చింది. మహేందర్ కూడా ఎప్పుడూ చదువుల్లో ముందుండేవాడు. అదే క్రమంలో ఇటీవల జరిగిన జేఈఈ ప్రవేశ పరీక్షలో మహేందర్ జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్ లో ఐఐటీ మద్రాస్ లో కెమికల్ ఇంజనీరింగ్ లో సీటు పొందాడు.

కానీ కోర్సుకు ఫీజు చెల్లించే స్థోమతలేక అతను కుంగిపోయాడు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం కావడంతో ఐఐటీ కల అందని మానిపండే అని బాదపడ్డాడు. ఈ కథనం పలు దినపత్రికల్లో రావడంతో ఆ న్యూస్ క్లిప్పింగ్ ను ఒక వ్యక్తి ట్విట్టర్ లో ఎంపీ కల్వకుంట్ల కవిత గారి దృష్టికి తెచ్చాడు. స్పందించిన ఎంపీ కవిత గారు నాలుగు సంవత్సరాల కోర్సుకు సంభంధించిన మొత్తం ఫీజు దాదాపు 5 లక్షల రూపాయలు తెలంగాణ జాగృతే భరిస్తుందని మహెందర్ కు తెలిపారు. మొదటి విడత చెక్ ను జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి నేడు మహేందర్ కు అందజేశారు. తన చదువు ముందుకు సాగేందుకు చేయూతనందించిన జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మహేందర్, అతని తల్లి కృతఙ్ఞతలు తెలిపారు.

Leave a Comment

Your email address will not be published.