తెలంగాణ జాగృతిలో చేరిన సంగారెడ్డి న్యాయ‌వాదులు

IMG-20170610-WA0090

తెలంగాణ జాగృతిలో చేరిన సంగారెడ్డి న్యాయ‌వాదులు

తెలంగాణ జాగృతిలో చేరిన సంగారెడ్డి న్యాయ‌వాదులు

సంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు న్యాయ‌వాదులు తెలంగాణ జాగృతి ల‌నుబంధ లీగ‌ల్ సెల్ వి|భాగంలో చేరారు. తెలంగాణ జాగృతి లీగ‌ల్ సెల్ క‌న్వీన‌ర్ తిరుప‌తి వ‌ర్మ న్యాయ‌వాదుల‌కు జాగృతి కండువాలు క‌ప్పి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి వర్మ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో తెలంగాణ జాగృతి ఉపాధ్య‌క్షుడు రాజీవ్ సాగ‌ర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌క పాత్ర పోషించిన తిరుప‌తి వ‌ర్మ వంద‌లాది మంది ఉద్య‌మ‌కారుల‌కు బెయిల్‌లు మంజూరు చేయించార‌న్నారు. ఉద్య‌మకారుడిగానే కాకుండా న్యాయ‌వాదిగా ఇప్ప‌టికీ తెలంగాణ స‌మాజ‌శ్రేయ‌స్సుకు పాటుప‌డుతున్నార‌ని చెప్పారు. తిరుప‌తి వ‌ర్మ మాట్లాడుతూ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ కాంక్ష‌తో ప‌నిచేసిన వారందరినీ తెలంగాణ స‌మాజం మ‌రువ‌ద‌న్నారు. ఇప్పుడు బంగారు తెలంగాణ సాధ‌న కోసం న్యాయ‌వాదులు ఉద్య‌మ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నార‌ని తిరుప‌తి వ‌ర్మ చెప్పారు. స‌మాజంలో ఇంకా చ‌ట్టం, న్యాయం ప‌ట్ల పూర్తిస్థాయి అవ‌గాహ‌న లేద‌ని, వారందిరికీ అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌తి న్యాయ‌వాదిపైనా ఉంద‌న్నారు. ఇందుకోసం అవ‌గాహ‌న స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి అధికార ప్ర‌తినిధి కుమార స్వామి, హైద‌రాబాద్ క‌న్వీన‌ర్ అనంతుల ప్ర‌శాంత్‌, న్యాయ‌వాదులు ఫ‌యీముల్లాఖాన్‌, ర‌వికుమార్‌,మ‌ధుసూద‌న్ రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్లు, అర‌వింద్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా క‌న్వీన‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి లీగ‌ల్ సెల్ క‌న్వీన‌ర్‌గా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని తెలంగాణ జాగృతి లీగ‌ల్ సెల్ రాష్ట్ర క‌న్వీన‌ర్ తిరుప‌తి వ‌ర్మ నియ‌మించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడుతూ జాగృతి న్యాయ విభాగాన్ని ప‌టిష్టం చేస్తాన‌న్నారు. త‌న‌కు అవ‌కాశం క‌ల్పించిన తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. —

Leave a Comment

Your email address will not be published.