తెలంగాణ జాగృతి ఎన్నారై శాఖలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కవిత

TJ D Img

తెలంగాణ జాగృతి ఎన్నారై శాఖలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన అధ్యక్షులు శ్రీమతి కవిత

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సంస్థ తెలంగాణ జాగృతి. ఇటీవలే దశాబ్ది ఉత్సవం జరుపుకున్న జాగృతి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో శాఖలతో తెలంగాణ వారి సంక్షేమానికి కృషి చేస్తుంది. ఈ క్రమంలో సంస్థ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఆయా దేశాల శాఖలకు నూతన అధ్యక్షులను నేడు ప్రకటించారు. నూతన భాద్యులు తెలంగాణ జాగృతి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ అభ్యున్నతికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణీయుల సంక్షేమానికి కృషి చేయాలని శ్రీమతి కవిత గారు సూచించారు.

నియామకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

జాగృతి అధ్యక్షులు:

జాగృతి గల్ఫ్ దేశాల అధ్యక్షులు: చెల్లంశెట్టి హరిప్రసాద్
యూఎఈ అధ్యక్షులు – కిరణ్ కుమార్ పీచర
బహరైన్ అధ్యక్షులు – బర్కుంట బాబూరావు
కువైట్ అధ్యక్షులు – ముత్యాల వినయ్ కుమార్
సౌదీ అరేబియా అధ్యక్షులు – మహమ్మద్ మొజ్జం

ఉత్తర అమెరికా (అమెరికా & కెనడా) అధ్యక్షులు – శ్రీధర్ భండారు,
ప్రధాన కార్యదర్శి – సుమంత్ గరకరాజుల.
అమెరికా అధ్యక్షులు – రాజ్ గౌలికర్
కెనడా అధ్యక్షులు – రమేష్ మునుకుంట్ల

—-
యూరోప్ అధ్యక్షులు – సంపత్ ధన్నంనేని
యూకే అధ్యక్షులు – సుమన్ బల్మూరి

ఆస్ట్రేలియా అధ్యక్షులు – నిశిధర్ రెడ్డి బొర్ర
న్యూజిలాండ్ అధ్యక్షులు – అరుణ జ్యోతి ముద్దం

విదేశీ శాఖలతో పాటు మహారాష్ట్ర శాఖకూ అధ్యక్షులను ప్రకటించడం జరిగింది.
మహారాష్ట్ర అధ్యక్షులుగా – శ్రీనివాస్ సుల్గే గారు వ్యవహరిస్తారు.

Leave a Comment

Your email address will not be published.