నేడు ప్రగతిభవన్ లో తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

TJ D Img

నేడు ప్రగతిభవన్ లో తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

నేడు ప్రగతిభవన్ లో తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు

ఈ నెల 20 న ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ జాగృతి తయారు చేసిన బతుకమ్మ పాటల సీడీని నేడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావు గారు ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ప్రజలో నోళ్లలో నానుతున్న అందమైన బతుకమ్మ పాటలతో ఇప్పటి వరకు 8 సీడీలను ప్రతీయేడు తయారు చెసిన తెలంగాన జాగృతి ఈ యేడు కూడా 12 మంది ప్రముఖ జానపద గాయకులు తయారు చేసిన 40 పాటలను శ్రీ చంద్రశేఖర్ రావు గారు ఆవిష్కరించారు. సాంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప మౌఖిక సాహిత్యమని, వాటిని సేకరించి రికార్డు చేయడం మంచి విషయమని ముఖ్యమంత్రి గారు తెలంగాణ జాగృతి ప్రతినిధులను అభినందించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్, డా. అయాచితం శ్రీధర్, దాస్యం విజయ్ భాస్కర్, అధికార ప్రతినిధి కుమారస్వామి, కోశాధికారి కోండపల్లి సంతోష్ కుమార్, మహిళావిభాగం కన్వీనర్ డా. ప్రభావతి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను మరియు వివిధ విభాగల కన్వీనర్లు కొరబోయిన విజయ్, పసుల చరణ్, డా. ప్రీతి రెడ్డి, దాసరి శ్రీనివాస్, అంజనా రెడ్డి, తిరుపతి వర్మ, డా. కాంచనపల్లి తదితరులు పాల్ఘొన్నారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గారు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు పాల్ఘొని జాగృతిని అభినందించారు.

Leave a Comment

Your email address will not be published.