మతిస్థిమితం లేక దుబయిలో చిక్కుకుపోయిన యువకుడి స్వదేశానికి తరలింపు

WhatsApp Image 2017-06-17 at 7.29.00 PM (3)

మతిస్థిమితం లేక దుబయిలో చిక్కుకుపోయిన యువకుడి స్వదేశానికి తరలింపు

మతిస్థిమితం లేక దుబయిలో చిక్కుకుపోయిన యువకుడి స్వదేశానికి తరలింపు

ఎంపీ కవిత గారి సూచన మేరకు తెలంగాణ జాగృతి UAE శాఖ చొరవతో స్వగ్రామం నిజామాబాద్ జిల్లా యానపల్లి చేరిన సాయి

సహాయకుడిగా సేవలందించి, అనువాదకుడిగా కౌన్సిలింగ్ లు ఇప్పించి వైద్యుల సూచన మేరకు సాయి వెంట ఇండియా వచ్చి కుటుంబ సభ్యులకు అతన్ని అప్పగించిన దుబాయి జాగృతి నాయకులు షేక్ అహ్మద్

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి సాయి కుమార్ (24) ఉపాధి కోసం 2015 జూన్ మాసంలో UAE – ఉమాల్ కోయిన్ లోని అల్ తబక్ అల్ శకిన్ రెస్టారెంట్ లో పని చేసాడు. అప్పటి వరకు బాగానే ఉన్న సాయి రెండు నెలల క్రితం నుండి మతి స్థిమితం కోల్పోయి పెద్ద పెద్ద అరుపులతో రోడ్ల మీద తిరుగడంతో, బట్టలు లేకుండా తోటి కార్మికులు నివసించే గదిలో ఇబ్బంధి కల్గించడంతో కంపెనీ వీసా కాన్సల్ చేసి నెల రోజుల క్రితం ఒక మనిషిని ఇచ్చి సాయిని ఇండియాకి పంపడానికి చేసిన ప్రయత్నించింది కంపెనీ. అయితె వచ్చేముందు షార్జా ఎయిర్పోర్ట్ లో వింతగా ప్రవర్తించడం వల్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇండియా పంపకుండా పోలీసులకు అప్పగించడం జరిగింది. వెంటనే పోలీసులు ఎయిర్పోర్ట్ హాస్పిటల్ లో సాయి మానసిక స్థితిని పరీక్షించి ప్రయాణానికి అనర్హుడని, చికిత్స చేయించి డాక్టర్ సర్టిఫికెట్ పొందిన తరువాతే పంపాలని సూచించడం జరిగింది.

ఎయిర్ పోర్ట్ వైద్య సిబ్బంది ఇచ్చిన లేఖ తో దుబాయ్ లోని రషీద్ హాస్పిటల్ లో సాయిని అడ్మిట్ చేయడం జరిగింది, పది రోజుల చికిత్స అనంతరం కూడా ఎలాంటి మార్పు రాకపోవడంతో వైద్య ఖర్చులకి ఇబ్బంది కల్గడం తో జరిగిన పరిస్థితిని ఇండియాలోని బాధితుని కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ జాగృతి చారిటీ కోఆర్డినేటర్ షేఖ్ అహ్మద్ దృష్టికి తీసుకెళ్లి సాయిని తొందరగా ఇంటికి పంపాలని కోరారు. వెంటనే స్పందించిన షేఖ్ అహ్మద్ సాయి పరిస్థితిని తెలుసుకోవడానికి హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్స్ ను సంప్రదించి వారు చెప్పిన విషయాన్ని UAE జాగృతి అధ్యక్షులు కిరణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారి దృష్టికి తీసుకెళ్లి సాయి పరిస్థితిని వివరించడం జరిగింది. షేఖ్ అహ్మద్ ప్రతి రోజు హాస్పిటల్ కు వెళుతూ సాయితో మాట్లాడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెపుతూ డాక్టర్స్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ జాగృతి ద్వార తనే స్వయంగా వెంట వెళ్లి ప్రయాణ ఖర్చులను సైతం భరిస్తామని వాళ్ళ కుటుంబానికి అప్పగిస్తామని డాక్టర్స్ కి చెప్పడం జరిగింది.

Leave a Comment

Your email address will not be published.