కాఫర్ డ్యాం నిర్మించి ప్రాణహిత నీటిని మళ్లించాలి

నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాం నిర్మించుకుంటే కన్నేపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తాం

మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దు

ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను  చెబుతున్నాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

పార్టీ నాయకులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రాణహిత ప్రవాహాన్ని పరిశీలించిన టీఆర్ఎస్ చీఫ్

(తెలంగాణ రక్షణ సేన, కాళేశ్వరం)

రాష్ట్రంలో కరవు పరిస్థితులను ఎదుర్కొని రైతులకు మేలు చేయాలంటే వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93 మీటర్ల ఎత్తులో కాఫర్ డ్యామ్ నిర్మించి ప్రాణహిత నీళ్లను మళ్లించాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వానికి సూచించారు. కేవలం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తే నెలన్నర రోజుల్లో ఈ డ్యామ్ ను పూర్తి చేయవచ్చన్నారు. సోమవారం కన్నెపల్లి పంప్ హౌస్ ను టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె సందర్శించారు. అక్కడ నీటి ప్రవాహాన్ని పరిశీలించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా కాఫర్ డ్యామ్ నిర్మాణం ఎక్కడ చేపట్టవచ్చొ…దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో వివరించారు. రాష్ట్రంలో ఎంతటి కరువు పరిస్థితులున్న సరే ప్రాణిహిత నదిలో రోజుకు రెండు టీఎంసీల నీళ్లు ప్రవహిస్తుంటాయన్నారు. ఆ నీటిని సరిగా వాడుకుంటే చాలని చెప్పారు. నవంబర్ లోగా కాఫర్ డ్యామ్ నిర్మించాలని రైతుల తరఫున ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నామని..వినకపోతే  ప్రభుత్వం మెడలు ఎలా వంచాలో తమకు తెలుసని అన్నారు. మేడిగడ్డ బూచిని చూపి రైతులకు నష్టం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. కరువు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తాము ఎంతో అధ్యయనం చేసి నిపుణులతో మాట్లాడి కాఫర్ డ్యామ్ నిర్మాణమే సొల్యుషన్ అని గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించిన టెక్నికల్ డీయిటెల్స్ ను కూడా ప్రభుత్వానికి ఇస్తామన్నారు. తామిచ్చిన సూచనను నిపుణులతో మాట్లాడి ప్రభుత్వం పరిశీలించాలని..ఈ విషయంలో ఏదైనా మార్పులు ఉన్నా సరే తాము అంగీకరిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం జరగకూడదనేది తమ తాప్రయతమని చెప్పారు. వెంటనే ప్రభుత్వం ఈ పనులను చేపట్టి కరవు కోరల్లోంచి బయటపడే ప్రయత్నం చేయాలన్నారు.

ప్రశ్నించటమే కాదు పరిష్కారం చూపిస్తాం

ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే కాకుండా పోరాటం చేస్తూ పరిష్కారానికి కూడా తామే మార్గం చెబుతామని కవిత అన్నారు. ఇతర పార్టీల మాదిరిగా రెండు రోజులు హడావుడి చేసి టీవీల్లో కనిపించటం తమ ఉద్దేశం కాదని చెప్పారు. కరవు నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్న దానిపై నిపుణులతో మాట్లాడిన తర్వాతే కాఫర్ డ్యామ్ అనే ఆలోచన చేశామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో నవంబర్ వరకు రైతులకు నీళ్లు, కరెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని చెప్పారు. కరవు పరిస్థితులను ముందే గ్రహించి కొన్ని రోజుల క్రితమే రైతులకు నవంబర్ వరకు ఉచిత కరెంట్ ఇవ్వాలని తామే డిమాండ్ చేశామని గుర్తు చేశారు. తాము కోరిన తర్వాతే ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పందించి కేంద్రాన్ని కరెంట్ అడుగుతామని చెప్పారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కోటి 10 లక్షల ఎకరాల పంటకు నీళ్లు, కరెంట్ అవసరం ఉందని చెప్పారు. నవంబర్ చివరి వరకు కరెంట్, నీళ్లు ఇచ్చి రైతుల పంటలను కాపాడాలని కోరారు. ప్రతిపక్షాలంటే ఓ వైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే సమస్య పరిష్కారానికి సొల్యుషన్ కూడా చెప్పాలన్నారు. ప్రశ్నించు, పోరాడు, పరిష్కారించు అనే నినాదంతో ఆ పనిని తమ పార్టీ చేస్తుందని చెప్పారు. కరెంట్, నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని..ఈ విషయాన్ని రాష్ట్రంలోని ప్రతి రైతుకు తెలిసేలా చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

తెలంగాణ వచ్చాక కూడా నీళ్ల విషయంలో న్యాయం జరగలే

తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా మనం మన వాటా నీళ్లను సంపూర్ణంగా వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. మా నీళ్లు మాకేనంటూ పిడికిలెత్తి తెలంగాణ ఉద్యమం చేసిందే నీళ్ల కోసమని గుర్తు చేశారు. కానీ తెలంగాణ వచ్చాక కూడా మన నీళ్లను మనం వాడుకోలేకపోతున్నామన్నారు. నిజానికి మనకున్న రెండు పెద్ద నదులైన గోదావరి, కృష్ణా నీళ్లను సరిగా వాడుకుంటే రాష్ట్రంలో కరవు అనే పరిస్థితే ఉండదని చెప్పారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి కృష్ణా నది పరివాహంలో 4 నుంచి 5 లక్షలు, గోదావరి లో లక్ష ఎకరాలకు మాత్రమే కొత్తగా నీళ్లు ఇచ్చిందని చెప్పారు. కాళేశ్వరం కోసం 93 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ పాత ఆయకట్టు స్థిరీకరణ, వరద ప్రవాహం కోసం మాత్రమే వాటిని ఖర్చు చేశారన్నారు. కాళేశ్వరం కాలువలను పూర్తి చేయాలంటే మరో 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉంటే కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి మరింత దిగజారిందన్నారు. రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని ధ్వజమెత్తారు. అడిగితే పాత బకాయిలు చెల్లించామని చెబుతున్నారని,  ఫీజు రీయింబర్స్ మెంట్, దళిత బంధు లాంటి బకాయిలు ఎందుకు చెల్లించటం లేదని ప్రశ్నించారు. మేడిగడ్డ బూచి చూపించి రైతులకు అన్యాయం చేయవద్దని..వెంటనే కాఫర్ డ్యామ్ పనులు చేపట్టాలని కోరారు. అదే విధంగా మేడిగడ్డ బ్యారేజ్ పనులను పూర్తి చేసేందుకు కూడా ఇదే మంచి సమయమని వెంటనే ఆ పనులను కూడా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 21 వేల చెరువులు ఎండిపోయి రైతులు, ముదిరాజ్ లు, బెస్త సోదరులు బాధలో ఉన్నారని చెప్పారు. వచ్చే పది నెలలు ఇంకా భయంకరమైన పరిస్థితులుంటాయని..వాటి నుంచి బయటపడేందుకు తామిచ్చిన సూచనను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలించాలన్నారు. 

చిన్న కాళేశ్వరం పూర్తి చేయాలి

మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వెంటనే పూర్తి చేయాలని కవిత డిమాండ్ చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ ప్రజలకు చిన్న మాటను నిలబెట్టుకోవాలని కోరారు. అదే విధంగా ముంపు బాధితులకు సరైన పరిహారం కల్పించాలన్నారు. పదేళ్లు ప్రతిపక్షం ఉన్న సమయంలో ప్రజలకు మాటిచ్చిన శ్రీధర్ బాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన ఎందుకు మాట నిలబెట్టుకోవటం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, పార్టీ సీనియర్ నాయకులు రియాజ్ అహ్మద్, సయ్యద్ ఇస్మాయిల్, నవీన్ కుమార్, లోక రవిచంద్ర, వెంకట్, నరేశ్ నేత తదితరులు పాల్గొన్నారు.