రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నది మీ నాయకులే
హరీశ్ రావుపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఆర్ఎస్ ప్రవీణ్ స్పందించడం వెనుక మర్మమేమిటి?
సిద్దిపేటలో కల్వకుంట్ల కవిత చూపించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే
అబద్ధపు ప్రచారాలతో అబద్ధాలు ఎప్పటికీ నిజం కాలేవు
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుల మండిపాటు
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :
సీఎం రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నది బీఆర్ఎస్ నాయకులే అన్న వాస్తవాన్ని ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తించాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్ సూచించారు. బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్ చిట్నేని రఘు, కంటోన్మెంట్ నియోజకవర్గ ఇన్ చార్జీ చింతల రాజలింగం, తుంగతుర్తి ఇన్ చార్జి సూరారపు కృష్ణవేణి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు పడాల మనోజాగౌడ్, నేషనల్ మీడియా స్పోక్స్ పర్సన్ ఎంఏ అశ్వక్ తదితరులు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.
నవీన్ మాట్లాడుతూ, ప్రతినిత్యం ప్రజల కోసం పని చేస్తున్న కల్వకుంట్ల కవితను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాకనే రేవంత్ రెడ్డి వెనుక ఉండి టీఆర్ఎస్ ను నడిపిస్తున్నారనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డితో అంటకాగుతున్నది బీఆర్ఎస్ లోని ముఖ్య నేతలే అన్న విషయాన్ని ఆ పార్టీ నాయకత్వం గుర్తించాలన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పిన కంపెనీ ఒక్క రూపాయి వ్యాపార లావాదేవీలు కూడా చేయకుండానే మూత పడిందని గుర్తు చేశారు. ఈ విషయంపై కవిత గతంలోనే స్పష్టత ఇచ్చినా రేవంత్ రెడ్డితో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే తప్పుడు ఆరోపణలు పదే పదే చేస్తున్నారని మండిపడ్డారు.
Mallanna Sagar Seismic Zone Report and CAG Observations
మల్లన్నసాగర్ సిస్మిక్ జోన్ లో ఉన్నదనే విషయాన్ని నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ జీఆర్ఐ) పరిశోధన చేసి చెప్పిందని.. ఈ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉందని తెలిపారు. ఇదే విషయమై అనేక పర్యాయాలు రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించి చర్చించారని గుర్తు చేశారు.
మల్లన్నసాగర్ నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని, భూకంపాలు వచ్చే ప్రమాదం.. ప్రభావంపై ఎలాంటి సర్వేలు చేయకుండానే 50 టీఎంసీల భారీ రిజర్వాయర్ నిర్మించారనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తమ నివేదికలోనూ ప్రస్తావించారని తెలిపారు. కాగ్ నివేదిక పబ్లిక్ డొమైన్ లో సింగిల్ క్లిక్ తో దొరుకుతుందనే వాస్తవం ఐపీఎస్ అధికారిగా పని చేసిన ప్రవీణ్ కు తెలియదా అని ప్రశ్నించారు.
Kondapochamma Sagar Vigilance Report and Alleged Irregularities
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, దానికి నీటిని తరలించే పంపుహౌస్ లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ ఏడాదిన్నర క్రితమే నివేదిక సమర్పించినా దానిని రేవంత్ రెడ్డి బయట పెట్టకపోవడానికి హరీశ్ రావుతో ఆయనకు ఉన్న లాలూచీ రాజకీయాలే కారణమని తెలిపారు. అయినా ఆ నివేదికను సీఎం పంపి కవితతో మాట్లాడించాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ అనడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుందన్నారు.
Vigilance Recommendations on Engineers and ₹263.54 Crore Recovery
కొండపోచమ్మ సాగర్ లో అక్రమాలకు పాల్పడిన హరీశ్ రావు సన్నిహిత ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్ సహా 28 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిపార్ట్మెంట్ రికమండ్ చేసిందని తెలిపారు.
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తో పాటు మరికొన్ని కాంట్రాక్టు సంస్థల నుంచి రూ.263.54 కోట్లు రికవరీ చేయాలని కూడా విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసిందన్నారు.
కవిత బహిర్గత పరిచిన విజిలెన్స్ రిపోర్ట్ అనేక మీడియా సంస్థల ప్రతినిధుల దగ్గర ఉందనే విషయాన్ని మరిచిపోయి ఆ నివేదిక కూడా కవిత ద్వారా సీఎం బయట పెట్టించాడు అని చెప్పడం ఆర్ఎస్ ప్రవీణ్ అవివేకానికి నిదర్శనమన్నారు.
Telangana Rakshana Sena Questions RS Praveen Kumar on BRS Corruption Allegations
హరీశ్ రావు అవినీతిని, గత ప్రభుత్వం చేసిన అవినీతిని కల్వకుంట్ల కవిత బయట పెట్టడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ వ్యతిరేకిస్తున్నారా? గత ప్రభుత్వంలో అసలు అవినీతి జరగలేదని చెప్పదలుచుకున్నారా అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వాలన్నారు.
ఒకవేళ గత ప్రభుత్వంలో అవినీతి జరగలేదని చెప్పడమే ఆయన ఉద్దేశమైతే బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎందుకు ఆరోపణలు చేశారో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
NIMS Hyderabad Allegations and Kavitha’s Letter
నిమ్స్ లో హెల్త్ మినిస్టర్ గా చేసిన అక్రమాలను సైతం ఆ హాస్పిటల్ ఫ్యాకల్టీ, జీపీఎఫ్ హోల్డర్స్ అసోసియేషన్ కవితకు లేఖ రాసిందని.. అదే లేఖను కవిత సిద్దిపేట మీడియా సమావేశంలో ప్రదర్శించడంతో పాటు మీడియాకు రిలీజ్ చేశారని తెలిపారు.
నిమ్స్ లో అక్రమాలపై నివేదిక కూడా కవితకు ఇచ్చి సీఎం మాట్లాడించారు అని ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పడం వెనుక అనేక కుట్రలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
Questions Over RS Praveen Kumar’s Political Association with Harish Rao
ఐపీఎస్ అధికారిగా తెలంగాణ ఉద్యమకారుల రక్తం కళ్ల చూసినప్పుడు కూడా హరీశ్ రావుతో ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసే ఉన్నారా అనే అనుమానం కలుగుతుందన్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టే మాజీ మంత్రిపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి ఆర్ఎస్ ప్రవీణ్ రియాక్ట్ అవుతున్నారని అన్నారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా వందలాది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులకు మాయమాటలు చెప్పి తన వెంట తిప్పుకున్న ప్రవీణ్ కుమార్ తన స్వార్థం కోసం వాళ్లందరిని వదిలేసి బీఆర్ఎస్ చేరారని తెలిపారు. ఎంపీ టికెట్ సహా పక్కా ప్యాకేజీ మాట్లాడుకునే నీలి రంగు కండువా తీసేసి గులాబీ రంగు కండువా కప్పుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారం వెనుక కూడా హరీశ్ రావు ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు.
Telangana Rakshana Sena Warns Against Personal Attacks on Kavitha
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. ఆడబిడ్డ ఏడ్చిన పార్టీ బాగుపడవనే విషయాన్ని బీఆర్ఎస్ పెద్దలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ధైర్యం ఉంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలే తప్ప ఆమె వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.








