సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని కాపాడిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
ఎల్లారెడ్డి పేట డిగ్రీ కాలేజీ పరిరక్షణకు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆర్థిక సాయం
మూడేళ్లుగా పెండింగులో ఉన్న కాలేజీ గుర్తింపు ఫీజు 1,30, 800 చెల్లింపు
పాంచజన్య సంకల్పంలో ప్రధానమైన ఉచిత విద్య భాగంగా ప్రభుత్వ డిగ్రీ కాపాడుకునేందుకే సాయం అందజేత
కవితకు కృతజ్ఞతులు తెలిపిన కాలేజీ విద్యార్థులు, సిబ్బంది
(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్/ సిరిసిల్ల) :
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గుర్తింపు రద్దు కాకుండా అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చారు. కాలేజీ గుర్తింపు కోసం ఏటా యూనివర్సిటీకి చెల్లించాల్సిన ఫీజును మూడేళ్లుగా చెల్లించటం లేదు. దీంతో రూ.1,30,800 బకాయి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఫీజును చెల్లించకపోతే గుర్తింపు రద్దవుతుందన్న ఆవేదనతో కాలేజీ పరిరక్షణ కమిటీ ఎంతో మంది దాతలను సంప్రదించింది. కానీ ఎవరి నుంచి కూడా సాయం అందలేదు. చివరగా సిరిసిల్ల టీఆర్ఎస్ ఇంఛార్జ్ మాజీద్ ను సాయం కోరగా ఆయన ఈ విషయాన్ని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే స్పందించిన కవిత ఆ మొత్తాన్ని తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పాంచజన్య సంకల్పంలో ఉన్న ఐదు కీలకాంశాల్లో ఉచిత విద్యనే ప్రధానమైందని..ప్రభుత్వ విద్యను కాపాడేందుకు తమ వంతుగా ఏ సాయమైనా చేస్తామని ఈ సందర్భంగా కవిత అన్నారని మాజీద్ తెలిపారు.

ఎంతో పోరాటం చేసి సాధించుకున్న డిగ్రీ కాలేజీ గుర్తింపు రద్దు కాకుండా ఆర్థిక సాయం అందించిన కవితకు కాలేజీ విద్యార్థులు, సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కవిత ఆర్థికసాయం అందించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఆయన కాలేజీ విద్యార్థులకు సిబ్బంది తెలుపగా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అల్లె శంకర్ , కదిరె రేణుక, మౌనిక, జావిద్, కదిరె భాస్కర్, శ్రీహరి, సాయి ప్రేమ్, సత్యం రెడ్డి, రాజేష్, హాజీ బాబా, భూపతి, అరుణ్ రెడ్డి, షబానా, మల్లవ్వ, దేవేంద్ర పరుశరాములు, అంకుష్ తదితరులు పాల్గొన్నారు








