జనగణనలో ఓబీసీల కులగణన చేపట్టాల్సిందే

బీసీలను మోసం చేస్తామంటే బీజేపీకి తగిన బుద్ధి  చెబుతాం

టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నవీన్ ఆచారి

ఢిల్లీలో ‘‘అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ’’ ఆందోళనలో పాల్గొన్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు

(తెలంగాణ రక్షణసేన, న్యూఢిల్లీ) :

విద్య, ఉద్యోగాలు, ఉపాధి, రాజకీయాల్లో బీసీలకు వారి జనాభా దామాషాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని తమ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత బలంగా కోరుకుంటున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రంగు నవీన్ ఆచారి తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల జనాభా ఎంత అన్న సంఖ్య తేలితే తప్ప వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు దక్కవని అన్నారు. కేంద్రం నిర్వహిస్తున్న జనగణనలో కుల గణన చేపట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. జనగణనలో ఓబీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. ‘‘అఖిల భారత కులగణన సమన్వయ కమిటీ’’ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో శనివారం నిర్వహించిన ఆందోళనలో టీఆర్ఎస్ తరఫున ఆయన పాల్గొని మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేసేందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కుల గణన చేపట్టడం లేదన్నారు. ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమని హెచ్చరించారు. దేశ నిర్మాణం కోసం రక్తం, చెమటను ధారపోసిన బీసీలు ఇప్పుడు తమ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. బీసీల కోసం పనిచేసే పార్టీలకే మన మద్దతు ఉండాలన్నారు. బీసీలకు అన్యాయం చేసే అన్ని పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు. జనాభాలో మన వాటా ఎంత ఉందో అన్ని రంగాల్లో అంత వాటా మనకు దక్కాల్సిందేనని అన్నారు. ఓబీసీ జనగణన కోసం ‘అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ చేపట్టే ఏ కార్యక్రమానికైనా టీఆర్ఎస్ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఎదురుగట్ల సంపత్ గౌడ్, నరేష్ ప్రజాపతి, కోల శ్రీనివాస్, ఎత్తరి మారన్న, మహేందర్ ముదిరాజ్, శ్రమన్, ఆకాశ్, సురభి తదితరులు పాల్గొన్నారు.

Naveen Achari demands OBC caste census and proportional representation in education, employment and politics during a Delhi protest.