Telangana Jagruthi

Kalvakuntla Kavitha Slams Revanth Reddy Over Telangana Drought
కరవుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి

ప్రెస్ మీట్ పెట్టి తన వైఫల్యాన్ని చెప్పుకున్న సీఎం

రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతోనే ఈ దుస్థితి

రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వడంతో పాటు ఇన్సూరెన్స్ చేయించాలి

రాష్ట్రం కరవులో ఉంటే సీఎం యాదాద్రి పవర్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తున్నడు

పవర్ మ్యాక్స్ కంపెనీతో ఉన్న ఒప్పందం ఏమిటో బయట పెట్టాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

ఎల్ నినోతో కరవు వస్తుందని శాస్త్రవేత్తలు ముందే హెచ్చరించినా ముందస్తు చర్యలు చేపట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయ్యారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జనవరి నుంచే ఎల్ నినో ఎఫెక్ట్ తో తీవ్రమైన కరవు వచ్చే ప్రమాదముందని హెచ్చరించినా కనీస చర్యలు చేపట్టలేదన్నారు. దొంగలు పడిన ఆరు నెలలకు ఏమో అన్నట్లుగా ఇప్పుడొచ్చి రైతులు త్యాగాలు చేయాలని నీతులు వల్లించడం సిగ్గుచేటు అన్నారు. కరవు విషయంలో తాను ఏమీ చేయలేనని సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారని మండిపడ్డారు. పాలకుడికి దూరదృష్టి ఉండాలని.. సీఎంలో అది లోపించిందని అన్నారు. పరిస్థితి మొత్తం చేయి దాటి పోయిన తర్వాత  వచ్చి రైతులు త్యాగాలు చేయాలని మాట్లాడటం దారుణమన్నారు. ఆగస్టులో 28 శాతం లోటు వర్షపాతం నమోదు అయ్యిందని.. అప్పుడే అప్రమత్తమై ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పక్క రాష్ట్రాలు కరవు మండలాలను ప్రకటించి కేంద్రానికి ఇప్పటికే నివేదిక పంపాయని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు నింపాదిగా రివ్యూలు అంటూ కాలం వెళ్లదీసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, ముఖ్యమంత్రి ముందే మేల్కొని ముందస్తుగా చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తప్పేవన్నారు. మన ముఖ్యమంత్రికి ప్రజల మీద శ్రద్ధ, సమస్యల మీద ఫోకస్ లేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుందని.. ఇప్పటి వరకు పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేయలేదని, మేడిగడ్డ బ్యారేజ్ ను కూడా రిపేర్ చేయలేదని అన్నారు. వాటిని పూర్తి చేసి ఉంటే ఇవ్వాళ రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.86 లక్షల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టులు పూర్తి కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 26 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్లు చేసుకోవడానికి ఇదే సరైన సమయమని.. వచ్చే వర్షాకాలంలోగా ఆ పనులు పూర్తి గోదావరి నీళ్లను వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎన్నాళ్లు గత ప్రభుత్వాన్ని తిడుతూ టైమ్ చేస్తారని ప్రశ్నించారు. తిట్టుడు బంద్ చేసి కట్టుడు షురూ చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఏడాదికి కృష్ణా నీళ్ల ఒప్పందం కుదుర్చుకుంటే ఆ వంకతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఏపీకి కృష్ణా నీటి ధారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డ అయి ఉండి కనీసం భీమా, నెట్టంపాడు ప్రాజెక్ట్ లను కూడా పూర్తి చేయకపోవటం అన్యాయమన్నారు. బీఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి శాపంగా సీఎం అనుభవ లేమి

సీఎం రేవంత్ రెడ్డి అనుభవలేమి రాష్ట్రానికి శాపంగా మారిందని మండిపడ్డారు. నీళ్ల విషయంలో, కరవును ఎదుర్కొనే విషయంలో సీఎం ఏమాత్రం ముందు చూపుతో వ్యవహరించలేదన్నారు. రైతులను త్యాగాలు చేయాలంటున్న ముఖ్యమంత్రి వారికి పరిహారం ఏం ఇస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని లీకులు ఇస్తున్నారే తప్ప ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయడం లేదన్నారు. యాసంగిలో పంటలు సాగు చేయకపోతే రైతు కూలీలు ఆగమయ్యే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీలే కాదు, రైతులు సైతం పనులు లేక పట్ణణాలకు వలస వెళ్లే పరిస్థితి ఉందని.. పట్టణాల్లో సరైన ఉపాధి అవకాశాలు లేవన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ఏమైనా అయితే వారి కుటుంబాలకు ఆగమవుతాయని అన్నారు. స్థానికంగా ఉపాధి లేక జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలానికి చెందిన 20 మంది కూలీలు పనికోసం కర్ణాటక వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారని చెప్పారు. వారి కుటుంబాలకు ఆధారం లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకంలో రైతు కూలీలకు పని కల్పిస్తామని చెప్తున్నప్పటికీ కేంద్రంతో మాట్లాడకుండా అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఉపాధి హామీలో పని దినాలు పెంచడం కోసం ఇప్పుడు కమిటీ వేస్తే ఎప్పుడు కేంద్రానికి నివేదిక ఇస్తారని.. వాళ్లు ఎప్పుడు ఆమోదిస్తారని ప్రశ్నించారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కుట్ర

రాష్ట్రం ఇంత సంక్షోభం ఉంటే సీఎం తన కుటుంబానికి సంపదను దోచేపెట్టే పనిలో ఉన్నారని కవిత మండిపడ్డారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో కొన్ని కాంపొనెంట్లను ప్రైవేటీకరించి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. పవర్ మ్యాక్స్ అనే కంపెనీతో ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కరెంట్ విషయంలో ప్రభుత్వానికి అధికారం ఉండాలని గతంలో మాట్లాడిన సీఎం.. ఇప్పుడు ప్రైవేటీకరణకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు, కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని.. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం ఉంటుందని ముందే గ్రహించి తాము ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. సర్ ప్లస్ కరెంట్ ఉన్న రాష్ట్రాలతో ముందే ఒప్పందం కుదుర్చుకొని ఉంటే కరెంట్ సమస్య వచ్చేది కాదన్నారు. అడుక్కుంటారో, కొనుక్కుంటారో గానీ నవంబర్ నెలాఖరు  వరకు రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. లేదంటే బోర్లపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కరెంట్ కష్టాలను అధిగమించేందుకు అవసరమైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కలుస్తామని.. ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలతో మాట్లాడతామని చెప్పారు.

హైదరాబాద్ నీటి కష్టాలకు కాంగ్రెస్సే కారణం

హైదరాబాద్ లో నీటి కొరతకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని కవిత చెప్పారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో పాటు నగరంలో పెద్ద ఎత్తున చెరువులు కబ్జా చేయటంతో నీళ్ల కష్టాలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 వేల చెరువులు మాయం చేశారని చెప్పారు. దీంతో నగరంలో భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. చెరువులను కాపాడాల్సిన హైడ్రా ఏం చేస్తుందని నిలదీశారు. కరువు బారిన పడిన రాష్ట్రాన్ని వదిలేసి తన కుటుంబానికి దోచి పెట్టేందుకు ముఖ్యమంత్రి రోజు అన్నదమ్ములతో మీటింగ్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ దోపిడీకి కేటాయించిన సమయంలో కొంత రాష్ట్ర ప్రజల కోసం కేటాయించి ఉంటే ఈ కష్టాలు వచ్చేవి కావన్నారు.

అఖిలపక్షం ఇప్పుడు గుర్తొచ్చిందా?

కరవును ఎదుర్కొనే విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని కవిత అన్నారు. కరువు విషయంలో అఖిలపక్ష మీటింగ్ పెడతామని అంటున్నారని కానీ దానితో ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. ఈ పని ముందే చేయాల్సిందని అన్నారు. బీసీ బిల్లు విషయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎందుకు తీసుకెళ్లలేదని నిలదీశారు. అవసరమైన విషయాల్లో సైలెంట్ గా ఉండి ఇప్పుడు తాను చేసిన తప్పుకు అందరినీ భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అఖిలపక్షం గుర్తొచ్చిందా అంటూ మండిపడ్డారు. కవులు, కళాకారులు, ప్రతిపక్షాలు, సినిమా స్టార్లను కరవు విషయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నారని.. కానీ గతంలో వారిని ఇబ్బంది పెట్టిన సంగతి ఏమిటని ప్రశ్నించారు. కష్ట కాలంలో రైతులకు తాము అండగా ఉంటామని, వారికి తమ తరఫున చేయగలిగిన సాయం చేస్తారని చెప్పారు. అదే సమయంలో ఈ ప్రభుత్వం చేతగాని తనం కారణంగా వచ్చిన కరువు ముప్పును కూడా ప్రజలకు వివరిస్తామన్నారు.

సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే నైజం కేటీఆర్ ది

విదేశీ బొగ్గు కొనుగోలు ఒప్పందాలపై విచారణ పేరుతో ప్రతిమ శ్రీనివాస్ రావుకు వ్యతిరేకంగా కేటీఆర్ లేఖ రాయడంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉద్యమకాలంలో బీఆర్ఎస్ కు పూర్తి అండగా ఉన్న శ్రీనివాస్ రావుపై విచారణ కోరడం అంటే నమ్మినోళ్లను నట్టేట ముంచడమేనన్నారు. సాయం చేసిన వాళ్లను, కుల బంధువులను ఇబ్బంది పెట్టడం.. ఇంటి మనిషినైనా తనను కిరాయి మనుషులతో తిట్టించే నైజం కేటీఆర్ ది అని మండిపడ్డారు. తెలిసి చేశాడో తెలియక చేశాడో గానీ లేఖ రాయడం ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. తెలియక చేసి ఉంటే ఆయనకు ఏమీ తెలియదని తాను చెప్పే మాటలు నిజమని.. తెలిసి చేసి ఉంటే అదే కేటీఆర్ నైజమని అన్నారు. సొంత మనుషులపై ఉడుకు నీళ్లు పోసే వ్యక్తి కేటీఆర్ అన్నారు. ప్రతిమ శ్రీనివాస్ ను సీఎం ఎందుకు కాపాడుతున్నాడని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాలని కానీ సాయం చేసిన వాళ్లపైనే విచారణ కోరుతూ లేఖలు రాయడమే కేటీఆర్ వ్యక్తిత్వమన్నారు. సింగరేణి కార్మికుల కష్టాలేవి కేటీఆర్ కు తెలియదన్నారు. సింగరేణిలో బీఆర్ఎస్ సభ పెట్టి బల ప్రదర్శన చేయడానికి ప్రయత్నించారు తప్ప కార్మికుల కష్టాలను కనీసం ప్రస్తావించలేదన్నారు. తమ పోరాటాలతోనే ప్రభుత్వం దిగి వచ్చి సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహిస్తుందని గుర్తు చేశారు. కార్మికుల కోసం పనిచేస్తున్న హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ కూటమే సింగరేణి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

The post Kalvakuntla Kavitha Slams Revanth Reddy Over Telangana Drought appeared first on Telangana Jagruthi.

Kalvakuntla Kavitha demands SC/ST Atrocities Act Cases Over Alleged Third-Degree Torture of Dalit Journalists
దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రజాస్వామ్యంపై దాడి

ఘటనకు బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యంపై దాడి అని తెలంగాణ రక్షణసేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులు పొత్తూరి శేఖర్, సంపత్ లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావు పేట్ ఎస్సై శ్రీకాంత్ మీద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె గురువారం “ఎక్స్” లో పోస్ట్ చేశారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన ఎస్సై సహా మిగతా పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సై భూ అక్రమాలు, పంచాయతీలు, సెటిల్ మెంట్లపై వార్తలు రాస్తే అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లోనే జర్నలిస్టుల నోట్లో గుడ్డలు కుక్కి, అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని తీవ్రంగా హింసించారన్నారు. ఇది అత్యంత అమానుష చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారంటే ఏ స్థాయిలో వారిపై పోలీసులు దాడి చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఈ తరహా దాడులు ఆక్షేపణీయమన్నారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని..ఈ ఘటనకు బాధ్యుడైన గంభీరావుపేట ఎస్సైపై నామమాత్రపు చర్యలతో సరిపెట్టాలని చూస్తే అది పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తుందన్నారు. ఈ విషయంపై డీజీపీ వెంటనే స్పందించి ఎస్సైతో పాటు బాధ్యులైన వారందరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ పై శాఖాపరమైన విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలి

తన అక్రమాలను ‘‘ఏక్ దమ్ న్యూస్’’ ఎడిటర్ పొత్తూరి శేఖర్, జర్నలిస్ట్ సంపత్ బయట పెడుతున్నారని కక్షగట్టిన గంభీరావుపేట ఎస్సై శేఖర్ వారిని అక్రమంగా అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించడంతో పాటు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్రజాస్వామికం

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఈ తరహా దాడులు ఆక్షేపణీయం.. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత దుర్మార్గం

ఈ ఘటనకు బాధ్యుడైన గంభీరావుపేట ఎస్సై పై నామమాత్రపు చర్యలతో సరిపెట్టడం పోలీస్ వ్యవస్థకే మంచిది కాదు.. డీజీపీ గారు వెంటనే స్పందించి ఎస్సైతో పాటు ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి

@TelanganaDGP @spsircilla
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 15, 2026

The post Kalvakuntla Kavitha demands SC/ST Atrocities Act Cases Over Alleged Third-Degree Torture of Dalit Journalists appeared first on Telangana Jagruthi.

CMO a Hub for Commission Deals, 15% Commission Threats: Kalvakuntla Kavitha
కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపీడి, లూటీ పాలన

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కమీషన్లకు అడ్డగా మార్చేశారని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ పనికి 15 శాతం కమీషన్ కావాలంటూ నేరుగా సీఎంఓ నుంచే బెదిరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయమంటూ గురువారం ఎక్స్ లో ట్వీట్ చేశారు. తమ అనుచరులకు, ఆప్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు చట్టాన్ని, నిబంధనలను ఏమాత్రం లెక్కచేయటం లేదన్నారు. ఏలాంటి అర్హతలు లేని వారికి కేవలం కమీషన్ల కోసం పనులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదు.. పచ్చి దోపిడీ, లూటీ పాలన.. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఈ అరాచకాలను సహించదని హెచ్చరించారు. ప్రజలకు, వ్యాపారులకు రక్షణగా ఉండాల్సిన ముఖ్యమంత్రి, ఆయన ఆఫీస్ నుంచే ఇలాంటి ఆగడాలు జరగటమేంటనీ ఆమె ప్రశ్నించారు. ప్రజలను దోచుకుంటూ కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్న వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ లూటీకి పాల్పడిన వాళ్లందరిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

A 15% commission demand, direct threats from the CMO, and shameless favouritism for cronies!

The Congress government has turned the Chief Minister’s Office into a mafia-style collection centre. This isn’t governance. It is blatant extortion.

Telangana will not tolerate this loot. Every single perpetrator will be held accountable!

— Kavitha Kalvakuntla (@RaoKavitha)

October 15, 2026

మహారాష్ట్ర తరహా మహిళా రైతుల సాధికారత చట్టం తేవాలి

మహిళా రైతుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా ‘మహిళా రైతుల సాధికారిత’ చట్టాన్ని..తెలంగాణలోనూ తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. గురువారం మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణలో మహిళా రైతుల దయనీయ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ఎక్స్ లో ట్వీట్ చేశారు. కుటుంబాన్ని చూసుకుంటూనే ఉదయం నుంచి రాత్రి వరకు పొలం, పాడి పనులతో తీరిక లేకుండా శ్రమిస్తున్న వారికి కనీస గుర్తింపు దక్కడం లేదన్నారు. గ్రామీణ ఆర్థిక ప్రగతి చక్రానికి ఇరుసుగా ఉన్న మా ఆడబిడ్డల కష్టాలు, త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహిళా రైతుల సాధికారత చట్టం -2026 ను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం కూడా చట్టం చేయాలన్నారు.  మహిళా రైతులకు, రైతు కూలీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పథకాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించాలన్నారు. మహిళా రైతుల దినోత్సవం సందర్భంగా సాగులో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 80 శాతం భాగస్వాములుగా ఉన్న మహిళల శ్రమను గుర్తిస్తూ..వారిని గౌరవించుకుందామని పిలుపునిచ్చారు.

The post CMO a Hub for Commission Deals, 15% Commission Threats: Kalvakuntla Kavitha appeared first on Telangana Jagruthi.

Telangana Constable Recruitment 2026: Kalvakuntla Kavitha Demands 75% ST Quota
కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

నోటిఫికేషన్లలో దీన్ని విస్మరించారు

ప్రభుత్వ నిర్లక్ష్యానికి 400 మంది ఎస్టీకి అన్యాయం

వెంటనే నోటిఫికేషన్ మార్చకుంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదు

-తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

ఏజెన్సీ ప్రాంతాల్లోని కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లను పూర్తిగా విస్మరించారని చెప్పారు. ఇది ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయమంటూ మంగళవారం ఎక్స్ లో ఆమె పోస్ట్ చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1988లో జారీ చేసిన జీవో 109తో పాటు, తెలంగాణ ఏర్పడిన తర్వాత  2018లో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ 49 ప్రకారం ఏజెన్సీ ఏరియా కానిస్టేబుల్ పోస్టుల్లో ఎస్టీలకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధంగా తప్పనిసరంటూ గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన 2015, 2018, 2022 కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్లలో ఈ రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేశారన్నారు. కానీ ఈ ఏడాది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంతాల ఎస్టీ రిజర్వేషన్లను విస్మరించారని మండిపడ్డారు.

ఎస్టీ యువత 400 ఉద్యోగాలు కోల్పోతారు

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు చెందిన ఆదివాసీ, గిరిజన యువత తీవ్రంగా నష్టపోతారని కవిత చెప్పారు. అర్హులైన నిరుద్యోగులు దాదాపు 400కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నారు. గత నోటిఫికేషన్లలో ఇచ్చిన హక్కును ఈ నోటిఫికేషన్‌లో తొలగించడమంటే గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను హరించడమే అవుతుందన్నారు. ఈ విషయంపై హోంమంత్రిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి  తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు న్యాయం జరిగేలా కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లోమార్పులు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎస్టీలకు దక్కాల్సిన 75 శాతం రిజర్వేషన్ల నిబంధనను పునరుద్ధరించాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ఎస్టీ యువత కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.

The post Telangana Constable Recruitment 2026: Kalvakuntla Kavitha Demands 75% ST Quota appeared first on Telangana Jagruthi.

Bathukamma 2026: Kalvakuntla Kavitha Announces 50% Seats for Women
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో అట్టహాసంగా బతుకమ్మ సంబురాలు

మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చి, ఆడిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత

మహిళలు, బహుజనుల కోసం పని చేసే తనను ఆశీర్వదించాలని పిలుపు

రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం సీట్లిస్తానని వెల్లడి

(తెలంగాణ రక్షణ సేన, హైదరాబాద్) :

తెలంగాణ అస్తిత్వ పతాక బతుకమ్మ వేడుకలు బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సోమవారం అట్టహాసంగా నిర్వహించారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ పేర్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ అందరితో పాటలు పాడిస్తూ బతుకమ్మలు పేర్చారు. ఈ సందర్భంగా బతుకమ్మ విశిష్టత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఈ పండుగ ద్వారా మహిళలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి ఎంతలా కృషి చేశామో వివరించారు. అనంతరం గౌరమ్మకు పూజలు చేసి మహిళా నాయకులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు

మహిళలు, బహుజనుల కోసం పాటు పడుతున్న తనను ఆశీర్వదించాలని రాష్ట్ర ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. బతుకమ్మ సంబురాల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళా నాయకత్వాన్ని పెంపొందించడానికి తాను కృషి చేస్తున్నానని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలు ఎలా ఉన్నా.. రిజర్వేషన్లు అమలు చేసినా, చేయకున్నా తమ పార్టీ రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 50 శాతం సీట్లను మహిళలకు ఇస్తుందని ప్రకటించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రపంచంలో ఎవరికీ లేని అత్యంత విశిష్టమైన బతుకమ్మ పండుగ మన తెలంగాణ సొంతమని అన్నారు. ప్రపంచానికి చాటేలా ఈ పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బతుకమ్మ పాటలు నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందజేయాలని సూచించారు. బతుకమ్మ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి బతుకమ్మ ప్రతీకగా నిలిచిందని గుర్తు చేశారు. గౌరమ్మ తల్లి ఆశీర్వాదంతో తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

The post Bathukamma 2026: Kalvakuntla Kavitha Announces 50% Seats for Women appeared first on Telangana Jagruthi.

Telangana Story Competition 2026: Harida Award Details
పండిత, పామరులను అలరించే తెలంగాణ భాష

‎ -తెలంగాణ జాగృతి ఫౌండర్, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

భాషా మాధుర్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే కృషి గొప్పది- అనన్య నాగళ్ల

‘సరస్వతీరాజ్-హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం – 2026’ పోటీల పోస్టర్ ఆవిష్కరణ

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్) :

‎తెలంగాణ భాష జీవభాష అని, తెలంగాణ భాషలో వచ్చిన సాహిత్యం పండిత పామరులను ఒకే విధంగా ఆనందింపజేస్తుందని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ మాధుర్యాన్ని తరతరాలకు అందించే విధంగా హరిదా రచయితల సంఘం చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు. శనివారం బంజారాహిల్స్ లోని జాగృతి  కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సరస్వతీరాజ్ – హరిదా అంతర్జాతీయ ఉత్తమ తెలంగాణ కథా పురస్కారం – 2026’ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భాషలోని సోయగాన్ని, పదబంధాలను, నుడికారాలను, సామెతలను కథల ద్వారా ముందు తరాలకు అందించడం మంచి ప్రయత్నమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ భాషలో కథల పోటీ నిర్వహించడం ఆదర్శనీయమని, తెలంగాణ భాషలో కథను రాయగలిగిన రచయితలందరికీ ఇదొక గొప్ప అవకాశమన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.

భాష గొప్పతనం కథల ద్వారే తెలుస్తుంది- అనన్య నాగళ్ల

ఏ భాష గొప్పతనమైనా కథల ద్వారానే తెలుస్తుందని సినీ నటి అనన్య నాగళ్ల అన్నారు. కథలు ఆ ప్రాంతం భాష, సంస్కృతులను భవిష్యత్  తరాలకు అందజేసేందుకు సరైన సాధనాలని చెప్పారు. హరిదా రచయిత సంఘం కథ పోటీల ద్వారా రచయితల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఎంతో మంచి ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమాన్ని రచయితలంతా తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు.

తెలంగాణ భాష, సంస్కృతి వైభవాన్ని చాటేందుకే- ఘనపురం దేవేందర్

తెలంగాణ భాష, సంస్కృతుల వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతోనే ఈ అంతర్జాతీయ స్థాయి కథల పోటీలను నిర్వహిస్తున్నామని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాషలో కథలు రాసే రచయితలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కథల పోటీల నిబంధనలను వివరిస్తూ… తెలంగాణ ఆత్మ, జీవితం, సంస్కృతి, భాష, జీవన విధాన వైభవాన్ని చాటిచెప్పే ఏదైనా అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని కథను తెలంగాణ భాషలోనే రాయాలని వివరించారు. కథలో తెలంగాణతనం తప్పనిసరిగా ప్రతిబింబించాలని, ఎక్కడా ప్రచురితం కాని, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయని, ఇతర పోటీలకు పంపని సరికొత్త కథలను మాత్రమే పంపాలని స్పష్టం చేశారు. రచన అనువాదం, అనుకరణ లేదా అనుసరణ కాకూడదని పేర్కొన్నారు. కథలను అక్షర దోషాలు లేకుండా యూనికోడ్ (Unicode) 14 సైజు ఫాంట్‌లో టైప్ చేసి, ఏ4 సైజులో గరిష్ఠంగా ఎనిమిది పేజీలకు మించకుండా పంపాలని సూచించారు. కథ రాసిన పేజీలపై రచయిత పేరు రాయకూడదని, నిబంధనలను అంగీకరిస్తూ విడిగా జతచేసే హామీపత్రంపై మాత్రమే రచయిత పేరు, చిరునామా, ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ వివరాలను పొందుపరచాలని కోరారు. విజేతల ఎంపికలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.

మొదటి ఉత్తమ కథకు రూ. 10, 000

పోటీల్లో మొదటి ఉత్తమ కథకు రూ. 10,000/- నగదు పురస్కారం, తర్వాతి తొమ్మిది ఉత్తమ కథలకు ఒక్కొక్కరికి రూ. 1,000/- నగదు పురస్కారంతో పాటు సముచిత సత్కారం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఈ పురస్కారాలను డిసెంబర్ 4వ తేదీన నిజామాబాద్‌లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్‌లో జరిగే హరిదా రచయితల సంఘం మహాసభలో ప్రదానం చేస్తామన్నారు. ‎అర్హత, ఆసక్తి ఉన్న కథా రచయితలు తమ కథను, హామీ పత్రాన్ని అక్టోబర్ 30వ తేదీ లోపు haridaasaraswathiraj@gmail.com ఈ-మెయిల్ ఐడీకి పంపాలని కోరారు. ఇతర వివరాల కోసం 9030033331 నంబరును సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు రంగు నవీనాచారి, లకావత్ రూప్ సింగ్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

The post Telangana Story Competition 2026: Harida Award Details appeared first on Telangana Jagruthi.

Kalvakuntla Kavitha Registers as Graduate MLC Voter, Appeals for TRS Support
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటరుగా నమోదు చేసుకున్న టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి

(తెలంగాణ రక్షణసేన, హైదరాబాద్)

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఓటరుగా తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత తన ఓటు నమోదు చేసుకున్నారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఓటరు నమోదుపత్రం ఫిల్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానాల్లో అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సరైన సమయం ఇదేనని యువతకు సూచించారు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రశ్నించే గొంతుక అని.. తమ పార్టీ నుంచి రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వాళ్లకు అవకాశం ఇస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికైనా యువకులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

The post Kalvakuntla Kavitha Registers as Graduate MLC Voter, Appeals for TRS Support appeared first on Telangana Jagruthi.

Kalvakuntla Kavitha Demands CBI, ED Probe into Chitrapuri Colony Row | చిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి
కాలనీలో మిగిలిన 4 ఎకరాల భూమి కబ్జాకు గురికాకుండా కాపాడాలి

మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెంటనే చిత్రపురి కాలనీలో అక్రమాలపై స్పందించాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

టీఆర్ఎస్ చీఫ్ తో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకుల భేటీ

(తెలంగాణ రక్షణసేన,  హైదరాబాద్) :

చిత్రపురి కాలనీ సోసైటీలో జరిగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ అనే వ్యక్తి.. సోసైటీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒకే వ్యక్తి ఇంత అవినీతికి పాల్పడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల సహకారం ఉందని చెప్పారు. అనిల్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులతో కలిసి శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని విభాగాలను చెరబట్టిన అనిల్.. ఇప్పటికీ చిత్రపురి కాలనీలో అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. సినీ కార్మికులకు మేలు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నటుడు ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీకి 1994 లో 67 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. వాటిలో కార్మికులకు ఇళ్లను కేటాయించే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పారు. అప్పటి మంత్రుల సహకారంతో అవినీతికి పాల్పడిన అనిల్… ఇప్పుడు కాలనీలో మిగిలి ఉన్న 4 ఎకరాల భూమిపై కన్నేశారన్నారు. కో ఆపరేటివ్ సోసైటీ రూల్స్ ను తుంగలో తొక్కి ఆ భూమిని మార్టిగేజ్ పెట్టి రూ. 19 కోట్లు తీసుకున్నారన్నారు. తాజాగా ఆ భూముల్లో ఫ్లాట్లు కడుతున్నామంటూ నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇంత బాహాటంగా ఫ్లాట్లు కడుతున్నామంటూ అవినీతికి పాల్పడుతుంటే..కో ఆపరేటివ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర్ రావు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే ఈ భూమి విషయంలో జోక్యం చేసుకుని ఆ భూమిని పేద సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం ఉపయోగించాలని కోరారు.

అనిల్ ను వెంటనే తొలగించాలి

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ ను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కవిత డిమాండ్ చేశారు. ఫ్లాట్ల విషయంలోనే కాకుండా అక్కడ ఇళ్ల సముదాయాలను బట్టి కూడా వసూళ్లకు పాల్పడ్డారన్నారు. ఇటీవల జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కోసం సోసైటీ వాళ్ల నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారని చెప్పారు. మళ్లీ ఆదివారం జరగనున్న సీఎం సభ కోసం మరోసారి రూ.2 లక్షలు కావాలంటూ బెదిరిస్తున్నాడన్నారు. అదే విధంగా తోట రామకృష్ణ అనే సీనియర్ డైరెక్టర్ కు కేటాయించిన ఇంటిని వేరే వాళ్లకు అమ్మారని.. అడిగితే బాధితులను బెదిరిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఆదివారం జరిగే సభలో ముఖ్యమంత్రి రూ.10 కోట్లు కేటాయిస్తారని చెబుతున్నారని దాన్ని అనిల్ కు ఇవ్వవద్దని సూచించారు. ఆయన ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం చిత్రపురి కాలనీ వాసులకు లేదని.. ఆ మొత్తాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ కార్పొరేషన్ కు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీలో భూమి విలువ ఏడు వేల కోట్లు ఉంటుందని..అలాంటి చోట ఒకే వ్యక్తి ఇంత అవినీతి చేస్తుంటే ఎందుకు శిక్ష పడటం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. వెంటనే అనిల్ ను ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలి

సినీ కార్మికులు ఎంతో కష్టపడి ఇళ్లు కొనుక్కుంటే వారికి అన్యాయం జరుగుతోందని.. ఈ విషయంలో సినీ పెద్దలు చిరంజీవి, పవన్ కల్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు లాంటి వాళ్లు జోక్యం చేసుకోవాలని కవిత కోరారు. అలాట్ మెంట్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ కు చెందిన పీవీ శ్రీనివాస్ సతీమణికి ఇళ్లు కేటాయించారని చెప్పారు. అలాట్ మెంట్ కమిటీలో ఉన్న ఆమెకు ఇల్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. అదే కమిటీలో ఉన్న సుద్ధాల అశోక్ తేజ ఈ విషయంలో అక్కడ జరుగుతున్న అవినీతిని బయటకు వచ్చి చెప్పాలని కోరారు. మరో రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని..అప్పుడు సినీ కార్మికులకు న్యాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. చిత్రపురి కాలనీలో జరుగుతున్న అన్యాయంపై బాధితులతో కలిసి తాము పోరాటం చేస్తామన్నారు. కవితను కలిసిన వారిలో చిత్రపురి కాలనీ సాధన సమితి అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి శ్రీనివాస్, సుధీర్ కలగర, రవీంద్ర నాథ్ ఠాగూర్, తోట హరిత, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

The post Kalvakuntla Kavitha Demands CBI, ED Probe into Chitrapuri Colony Row | చిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి appeared first on Telangana Jagruthi.

Kavitha Demands Bharat Ratna for Kanshi Ram | ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం
కాన్షీరాంకు భారత రత్న ఇవ్వాలి

ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన,హైదరాబాద్):

అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కావాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన మహనీయుడు కాన్షీరాం అని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని చెప్పారు. అణగారిన వర్గాలకు నిజమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే ఆ మహనీయునికి మనమిచ్చే ఘనమైన నివాళి అని చెప్పారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అణగారిన వర్గాలను అసెంబ్లీకి తీసుకెళ్లి తీరుతామన్నారు. తెలంగాణ రక్షణ సేన సామాజిక న్యాయ సంకల్పానికి కాన్షీరామే స్ఫూర్తి అని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలంతా ఈ సామాజిక న్యాయ సంకల్పానికి కట్టుబడి, బహుజన సాధికారత కోసం నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

ప్రతి ఇంటికి పాంచజన్యం తీసుకెళ్లండి

తెలంగాణ రక్షణ సేన ప్రధాన సిద్ధాంతమైన పాంచజన్యాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజలకు ఏ సమస్య ఉన్నా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి అండగా నిలవాలని సూచించారు. నిజామాబాద్ జిల్లాలో రైతులను దోపిడీ చేస్తున్న దళారులను పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తే ఇప్పుడు అన్ని పార్టీలు రైతులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. మనం చేసే మంచి కార్యక్రమాలు వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పడానికి నిజామాబాద్ లో పార్టీ నాయకులు చేపట్టిన కార్యక్రమాలే చాటి చెప్తాయని అన్నారు. ప్రతి నాయకుడు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ ఏడాది పొడవునా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని.. వాటిపై ఎక్కడిక్కడ ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీలతో మనం తలపడాల్సి ఉంటుందని.. అందుకు పార్టీ నాయకత్వం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

The post Kavitha Demands Bharat Ratna for Kanshi Ram | ఆయన స్ఫూర్తితో సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తాం appeared first on Telangana Jagruthi.

Kalvakuntla Kavitha Says Telangana Martyrs’ Aspirations Must Shape a Just Society
అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి

సబ్బండ వర్గాలకు అధికారంలో వాటా దక్కాలి

-తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

(తెలంగాణ రక్షణసేన, చందుర్తి/వేములవాడ) :

అమరులు కోరుకున్న సమాజాన్ని నిర్మించడమే వారికి మనమిచ్చే సరైన నివాళి అని తెలంగాణ రక్షణసేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. చందుర్తి మండలం సనుగులలో మంగళవారం నిర్వహించిన అమరుల యాది కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సబ్బండ వర్గాలు, కులాలకు అధికారంలో భాగస్వామ్యం దక్కినప్పుడే అమరుల త్యాగాలకు ఫలితం ఉంటుందన్నారు. సమాజం కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ నిమ్స్ లో 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులుగా ఎంత నరకయాతన అనుభవించామో తనకు మాత్రమే తెలుసన్నారు. కేసీఆర్ తో ఇప్పుడు రాజకీయంగా విభేదించినా,  దారులు వేరైనా సమాజం కోసం ఆయన చేసిన త్యాగాన్ని మాత్రం మర్చిపోవద్దన్నారు. అదే విధంగా తెలంగాణ కోసం అమరులైన వారిని, మంచి సమాజం కోసం అప్పట్లో ఈ ప్రాంతంలో అసువులు బాసిన మావోయిస్టులను గుర్తు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. వారు ఆకాంక్షించిన సమాజాన్ని నిర్మించాల్సి ఉందని చెప్పారు.

అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో ఆ ఫలాలు నిజంగా అందరికీ దక్కాయా అన్నది సమీక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ వచ్చి 13 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటికీ పేదవాళ్లు మెరుగైన విద్య, వైద్యం కోసం పోరాడుతునే ఉన్నారని.. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ అని ప్రశ్నించారు. ఆనాడు భూస్వాములు, దొరలపై పోరాడితే.. ఇప్పుడు అధికారం అడ్డం పెట్టుకొని దోచుకుంటున్న వాళ్లపై పోరాటం చేస్తున్నామన్నారు. దోపిడీ విధానం మారిందే తప్ప వారిలో ఆ స్వభావం మారలేదని.. అది మారాలంటే నిరంతరం పోరాటం చేయాలన్నారు. యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే పరిస్థితి మారుతుందన్నారు. మాజీ మావోయిస్టులు, అమర వీరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా తాము పోరాటం చేస్తామన్నారు.

The post Kalvakuntla Kavitha Says Telangana Martyrs’ Aspirations Must Shape a Just Society appeared first on Telangana Jagruthi.